PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 11:04 pm Posted by : PEOPLES DAIRY NEWS

అంగన్వాడి కేంద్రంలో పౌష్టిక ఆహారం పంపిణీ.. ప్రారంభించిన సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ*

*అంగన్వాడి కేంద్రంలో పౌష్టిక ఆహారం పంపిణీ.. ప్రారంభించిన సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ*
*కోదాడ, పీపుల్స్ డైరీ:* మండలంలోని తాడ్వాయి గ్రామ అంగన్వాడి కేంద్రంలో గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులకు ప్రభుత్వం తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న ఏడు నెలలు నుండి మూడు సంవత్సరాలు వరకు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడ్వాయి గ్రామ సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ, బుచ్చిపాపయ్య ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు బాలామృతం, పాలు, గుడ్లు తదితర పౌష్టిక ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ, బుచ్చిపాపయ్య మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సంపూర్ణ పౌష్టిక ఆహారాన్ని ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. తద్వారా మహిళల్లో, చిన్నారుల్లో రక్తహీనత, పోషకాహార లోపాలు వంటి సమస్యలను అధిగమించవచ్చని, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉంటారని పేర్కొన్నారు.చిన్నారులకు చిన్నతనం నుంచే పౌష్టికాహారం అందించడం వల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదల బాగుంటుందని తెలిపారు. ఈ సేవలను గ్రామ లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రం టీచర్లు, ఆయా, ఆశా వర్కర్లు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.