అధికారం రాగానే మారిన నైజం.. నల్లబెల్లిలో పట్టించుకోని పాలకులు!

నల్లబెల్లి:పీపుల్స్ డైరీ నల్లబెల్లి మండల కేంద్రంలో పందుల సంచారం, దుర్వాసనపై నాటి విపక్ష నేతలు, నేటి పాలకులు ప్రదర్శిస్తున్న ద్వంద్వ వైఖరిపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అధికారంలో లేనప్పుడు ఊరిలో పందుల వల్ల కంపు కొడుతోందని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని నాడు నల్లబెల్లి తహసీల్దార్‌కు స్వయంగా లేఖలు ఇచ్చి హడావుడి చేసిన నాయకులు... నేడు అధికారం చేతికి వచ్చాక ఆ సమస్యను పూర్తిగా విస్మరించడం గమనార్హం. నాడు తహసీల్దార్‌కు ఫిర్యాదు.. నేడు నిమ్మకు నీరెత్తినట్లు! గతంలో పందుల సమస్యపై అప్పటి...