అనారోగ్యంతో వ్యక్తి మృతి.

అనారోగ్యంతో వ్యక్తి మృతి. (పీపుల్స్ డైరీ) క్రైమ్ అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అర్వపల్లి గ్రామానికి చెందిన సైద్ జానీ (45) వ్యవసాయ కూలీగా జీవనం సాగించేవాడు. సుమారు ఏడాది క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన జానీని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు క్షయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటున్న ఆయన, అనారోగ్యం మరియు కుటుంబ పరిస్థితులపై తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు....