*ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా*
తస్లీమా మహ్మద్..
రిజిస్ట్రేషన్–స్టాంప్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షురాలిగా తస్లీమా మహ్మద్..
హన్మకొండ :
తెలంగాణ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షురాలిగా ఉమ్మడి వరంగల్ పరిధిలోని చిట్స్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు,
ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల భవన్లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో తస్లీమాను అసోసియేట్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జి. వెంకటేశ్వర్లు, TGO అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రకటించి, నియామక పత్రాలు అందించాడు,
రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న తస్లీమా మహ్మద్కు అసోసియేషన్లో ముఖ్యమైన బాధ్యత అప్పగించడం పట్ల పలువురు గెజిటెడ్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు, ఆమె ఎన్నిక అనంతరం సహచర అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు,
ఈ సందర్భంగా తస్లీమా మహ్మద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడంతో పాటు, ప్రజల అవసరాలు మరియు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత గల ఉద్యోగులుగా తమపై ప్రత్యేక బాధ్యత ఉందని, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత కలిగేలా చేస్తానని తస్లీమా పేర్కొన్నారు,
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉద్యోగులు ఒక వారధిగా పనిచేస్తూ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు, అదే సమయంలో శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు,
ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, పరిపాలనా పరమైన ఇబ్బందుల పరిష్కారానికి అసోసియేషన్ వేదికగా సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు,
తనపై నమ్మకం ఉంచి సహకరించి అసోసియేట్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గెజిటెడ్ అధికారులు, ఉద్యోగులకు తస్లీమా మహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు, తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉద్యోగుల సంక్షేమానికి, శాఖ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆమె పేర్కొన్నారు,
తస్లీమా మహ్మద్ ఎన్నికతో రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ ఉద్యోగుల సమస్యలను ఉన్నతస్థాయిలో సమర్థవంతంగా ప్రస్తావించేందుకు మరింత బలమైన వేదిక లభించినట్లయిందని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు, ముఖ్యంగా ప్రజలకు నేరుగా సేవలందించే రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగులపై పెరుగుతున్న పని భారం, పరిపాలనా సవాళ్లు, సేవలలో పారదర్శకత వంటి అంశాలపై అసోసియేషన్ మరింత చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని తస్లీమా పేర్కొన్నారు.