PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 9:03 am Posted by : PEOPLES DAIRY NEWS

*ఎంజీఎం లో దారుణం!

ఎంజీఎం లో దారుణం!

ఉదయం నుండి రక్త పరీక్షలు నిర్వహించని డాక్టర్లు

రక్త నమూనాలను బయటకు పంపుతూ డబ్బు వసూలు

రక్త పరీక్షలకు సైతం ప్రైవేటు డాక్టర్లకు సిఫారసు

బయట నుండి డాక్టర్ వస్తారు అంటూ రోగుల ఎదురు చూపు

రక్త పరీక్షకు 300 రూపాయలంటూ బాదితుల గగ్గోలు

పీపుల్స్ డైరీ వరంగల్

ఎంజీఎం అంటేనే పేదల పాలిట వరంలా భావించే పెద్దాసుపత్రి అని రోగులకు సేవ చెయ్యాల్సిన డాక్టర్లే కనీసం రక్త పరీక్షలకు ప్రైవేట్ డాక్టర్ వచ్చి నమూనాలను సేకరిస్తారు అంటూ రోగులను గంటల తరబడి ఎదురుచూసేలా చేస్తున్నారు డాక్టర్లు లేక ఇలా జరుగుతుందా రక్త పరీక్ష నిర్వహించే పరికరం లేకుండాబోయిందా అనే అనుమానాలు రోగులకు ప్రశ్నార్థకంగా మారాయి అంతేకాకుండా కేవలం రక్తపరీక్షలు నిర్వహిస్తే 300 రూపాయలు ఖర్చు అవుతుందంటూ బహిరంగంగా వసూలు చేస్తున్నట్టు రోగులు వాపోతున్నారు ఇదంతా చూస్తుంటే వైద్యులకు తెలిసే ఈ తతంగం అంతా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి