PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 9:23 am Posted by : PEOPLES DAIRY NEWS

ఏకగ్రీవంగా జిల్లా ట్రెసా కార్యవర్గం ఎన్నిక..

ఏకగ్రీవంగా జిల్లా ట్రెసా కార్యవర్గం ఎన్నిక…

అధ్యక్షుడిగా ఎం. మహేందర్

ములుగు ప్రతినిధి, ఆగస్టు 2(పీపుల్స్ డైరీ):
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా), ములుగు జిల్లా శాఖ 2026–2029 పదవీకాలానికి నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి మహమ్మద్ రియాజుద్దీన్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా రెవెన్యూ క్లబ్ ప్రాంగణంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎం. మహేందర్, అసోసియేట్ అధ్యక్షుడిగా సిహెచ్.రవీందర్, ప్రధాన కార్యదర్శిగా ఎం. అనిల్ కుమార్, కోశాధికారిగా ఎం. రమేష్, ఉపాధ్యక్షులు పి. మహేందర్, కె. రవీందర్, సిహెచ్. రాజకుమారి, ఏ. శైలందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు, జి. నూతన్, కె. బలరాం, క్రీడా&సాంస్కృతిక కార్యదర్శి, సిహెచ్. కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శులు, ఎం. వర్ష, జి. నంద కిషోర్ ఎండి. నదీమ్ ఖాన్, మల్లయ్య కార్యవర్గ సభ్యులు జే. అనూష, కె. సాత్విక్, కె. నర్సింహా మూర్తి, ఎం. రవీందర్ ఎన్. భాస్కర్, ఎం.బిక్షపతిలు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు జిల్లా రెవెన్యూ ఉద్యోగులు అభినందనలు తెలియజేస్తూ, ఉద్యోగుల సంక్షేమం, సేవా సమస్యల పరిష్కారం, సంఘ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రెవిన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.