PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 10:52 am Posted by : PEOPLES DAIRY NEWS

గ్రామాలలో ఘనంగా గణపతి ఉత్సవాలు .

గ్రామాలలో ఘనంగా గణపతి ఉత్సవాలు

ఏన్కూరు సెప్టెంబర్ 16 పీపుల్స్ డైరీ

మండల వ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడ వాడలా గణనాధులు కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన గణపతి పుట్టినరోజు వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాస శుక్ల పక్ష చతుర్ధి నాడు ప్రారంభమవుతుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. వినాయకుడికి ఇష్టమైన పదార్థాలైన ఉండ్రాళ్ళు, లడ్డులు, కుడుములు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఉదయం, రాత్రి వేళల్లో మండపాలలో కొలువుదీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వినాయక ఉత్సవాలతో గ్రామాలలో సందడి నెలకొంది