PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 3:21 pm Posted by : PEOPLES DAIRY NEWS

గ్రామాలలో భక్తిశ్రద్ధలతో బోనాల జాతర వరుణ దేవుడి కరుణ కోసం పూజలు

గ్రామాలలో భక్తిశ్రద్ధలతో బోనాల జాతర
వరుణ దేవుడి కరుణ కోసం పూజలు

ఏన్కూరు జులై 26 పీపుల్స్ డైరీ

ఏన్కూరు మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం వర్షాల కోసం బోనాలు జాతర కార్యక్రమాలను నిర్వహించారు .వర్షాలు కురవాలని ఏన్కూరు టి ఎల్ పేట ,కేసుపల్లి, లచ్చగూడెం గ్రామాలలో గ్రామ దేవతలకు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు ,మహిళలు పెద్ద ఎత్తున మేల తాళాలతో డబ్బు వాయిద్యాలు నడుమ బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరి, గ్రామ దేవతల వద్దకు చేరుకుని, పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ,పంటలు బాగా పండాలని ,గ్రామ దేవతలను వేడుకొన్నారు. టి ఎల్ పేటలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు ప్రవీణ్,ఉప సర్పంచ్ నామ వెంకయ్య, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాసరావు, ఇల్లూరి ఆదినారాయణ ,పాశం ఉమామహేశ్వరరావు, ఎల్లంకి లక్ష్మీ నరసయ్య, జుజ్జురి శ్రీనివాసరావు ,గడ్డం వెంకటేశ్వర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.