
ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం…
1/70 చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి
3జీవో ని పునర్దరించేయాలని భారీ నిరసన ర్యాలీ.
ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ
0నూగురు వెంకటాపురం, ఆగస్టు 9(పీపుల్స్ డైరీ):
ఆదివాసి సంఘాలు, ఆదివాసి ఉద్యోగ సంఘాలు, ఆదివాసి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి, ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆదివాసి సమాజం చాటిచెప్పేలా ఆకుపచ్చ జెండా కుల పెద్ద పాయం నాగేశ్వరరావు ఆవిష్కరణ చేసారు. అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పూర్తిగా అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం చట్టాలను కూని చేస్తున్నారని తెలిపారు. 3 జీవో చట్టాన్ని నిర్వీర్యం చేసే గిరిజనేతరులు ఎన్నో కుట్రలు చేసి దాని కొట్టి వేసే ప్రయత్నం చేసి ఏజెన్సీ ప్రాంతంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారని అన్నారు. 5వ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీల గుండె లాంటి పార్లమెంటు 1/70 చట్టం, పీసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు నివసించడం చట్ట విరుద్ధమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 1/70 చట్టాన్ని రద్దు చేయాలని కొంతమంది గిరిజనేతరులు సుప్రీం కోర్టులో కేసు వేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి చట్టాలను సంహరించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఏమిటని వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, జరగబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో ఆదివాసి ఎమ్మెల్యేలు అందరూ కలిసి 1/70 చట్టం పూర్తిస్థాయిలో అమలు జరగాలని తీర్మానాలు చేయాలని ఆదివాసి అందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 నీ పునర్దించి, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు 100 శాతం ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, ప్రభుత్వం ఆదివాసులను ముక్కలు చెక్కలుగా విభజించి పాలించారని నేటి ప్రభుత్వం ఆదివాసి చట్టాలను రద్దు చేయాలని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నారని, ఏజెన్సీ ప్రాంతం నుండి బూర్జవ రాజకీయ పార్టీలను బహిష్కరించాలని, బూర్జవ రాజకీయ పార్టీలను బహిష్కరించినప్పుడే ఆదివాసి చట్టాలు ఉన్నంత స్థాయిలో అమలవుతాయని వారు అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పిసా చట్టం ప్రకారంగా పిసా గ్రామ సభలు తీర్మానాలు చేసి రాష్ట్రపతి గవర్నర్ లకు పంపిస్తామని పిసా చట్టం ద్వారా 1/70 చట్టాన్ని అమలు చేసుకుంటామని వారు అన్నారు. శ్రీకాకుళం నుండి అదిలాబాదు వరకు కలిపి ఆదివాసులకు ప్రత్యేకంగా స్వయం పాలన ఏర్పాటు చేయాలని.1/70 అమలు కోసం నేటి నుండి నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతం నుండి గిరిజనేతరులను వెంటనే మైదాన ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, పూనేం రామచంద్రరావు, పూనేం సాయి యాసం రాజు, మడకం చిట్టిబాబు, చింత సమ్మయ్య, సిద్ధమైన సర్వేశ్వరరావు, ఉయిక శంకర్, కోర్స నరసింహమూర్తి, గుర్రపు రామారావు, పూనేం మునేశ్వరరావు, జజ్జరి నారాయణమ్మ, వాసం లక్ష్మయ్య, కుర్చంటు చిరంజీవి, కోరం సంతోష్, పసుపులేటి సూర్యనారాయణ, గొంది శేషగిరిరావు, ఎట్టి బాబురావు, తోలం చిరంజీవి, సిద్ధబోయిన భుజంగరావు, పూనెం రమణయ్య, పీర్ల కృష్ణ బాబు, జజ్జర్ సుధాకర్, రావు చింత శేషగిరి, ఉండం రామచంద్ర ప్రసాద్, పోడెం రాజేష్, ఆదివాసి ఉద్యోగ సంఘ నాయకులు, ఆదివాసి మహిళా సంఘం నాయకురాలు, ఆదివాసి యువత, ఆదివాసి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.