ఘనంగా హరీష్ రావు బర్త్‌డే వేడుకలు: యువతకు క్రికెట్ కిట్ అందజేత!
ఖండాంతరాల్లో ఉన్నా వీడని అభిమానం.. యూకే NRI అంజన్ రావు నల్లబెల్లి సౌజన్యం
(నల్లబెల్లి), జూన్ 03:
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా నల్లబెల్లి మండలం, కొండాయిలపల్లి గ్రామంలో యువతకు క్రికెట్ కిట్‌ను అందజేశారు. BRS ఎన్నారై యూకే ప్రతినిధి అంజన్ రావు నల్లబెల్లి సౌజన్యంతో సమకూరిన ఈ కిట్‌ను, బీఆర్ఎస్ యూత్ నాయకుడు తెలంగాణ విజయ్ గ్రామ యువతకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎన్నారై అంజన్ రావు మాట్లాడుతూ… తాము ఖండాంతరాల్లో ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రం పట్ల, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, హరీష్ రావు గారిపై ఉన్న అభిమానంతోనే యువతను ప్రోత్సహించడానికి ఈ క్రికెట్ కిట్ అందజేసినట్లు తెలిపారు. నిబద్ధత గల నాయకుడి పుట్టినరోజున ఇలాంటి కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు.
“మాకు క్రికెట్ కిట్ అందజేసి అండగా నిలిచిన ఎన్ఆర్ఐ అంజన్ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.”
— గ్రామ యువత, కొండాయిలపల్లి
ఘనంగా కేక్ కటింగ్ వేడుకలు..
హరీష్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామ యువత సమక్షంలో తెలంగాణ విజయ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిండ్ల గోపి, ఎద్దు హరిమోహన్, ఎద్దు రంజిత్, ఎద్దు రాము, ముస్కు హరీష్, వీరమళ్ళ రజినీకర్, రణధీర్ మరియు స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.