తల్లిపాలే శిశువుకు తొలి టీకా.. జీవితాంతం ఆరోగ్యానికి పునాది.
*తల్లిపాలే శిశువుకు తొలి టీకా.. జీవితాంతం ఆరోగ్యానికి పునాది* *ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో మెడిసిటీ–అల్వాల్ పీహెచ్‌సీ సంయుక్త అవగాహన కార్యక్రమం* *తల్లిపాలపై అపోహలను వీడి ప్రతి తల్లి బిడ్డకు స్వయంగా పాలివ్వాలి: వైద్య నిపుణులు* మేడ్చల్, ఆగస్టు 5(పీపుల్స్ డైరీ):- శిశువుకు జన్మనిచ్చిన ప్రతి తల్లి అందించే తొలి బహుమతి తల్లిపాలేనని, అవే బిడ్డకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించే తొలి టీకా అని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల (ఆగస్టు 1–7) సందర్భంగా మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,...