
నాచారం దగ్గర వాగులో చిక్కుకున్న కారు .
కాపాడిన స్థానికులు
ఆరుగురు క్షేమం .
ఏన్కూరు ఆగస్టు 9 పీపుల్స్ డైరీ
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారం దగ్గర ఆదివారం ఉదయం వాగులో చిక్కుకున్న కారును స్థానికులు కాపాడారు .అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు .వివరాలు ఇలా ఉన్నాయి .ఖమ్మం కు చెందిన భక్తులు కారులో భద్రాచలం వెళ్తూ, మార్గమధ్యంలో ఉన్న ఏన్కూరు మండలం నాచారం శ్రీశ్రీశ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి వచ్చే సమయంలో వాగు మాములుగా ప్రవహిస్తున్నది, వారంతా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో వాగు వద్దకు రాగానే ప్రవాహ ఉధృతి పెరిగింది. దీంతో కారులోని డ్రైవర్ ఐదుగురు మహిళలు బయటకు వస్తున్న క్రమంలో వారిలోని ఒక మహిళ వాగు ప్రవాహ ఉధృతికి కొంచెం దూరం కొట్టుకుపోవడంతో, అప్రమత్తమైన స్థానికులు ఆ మహిళను కాపాడారు. కారును ట్రాక్టర్ సహాయంతో బయటకు తీశారు. ఈ సంఘటనలో భక్తులు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు .నాచారం దేవాలయం సమీపంలోనీ పెద్దవాగు ఆదివారం కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.