నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి : డా.ప్రసన్న హరికృష్ణ

పీపుల్స్ డైరీ,హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్తి డా.ప్రసన్న హరికృష్ణ సోమవారం రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామకాల కోసం సుమారు 19 వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని, అభ్యర్థుల కోసం వయోపరిమితిని పెంచాలని, జీవో నెం.46ను రద్దు చేయాలని, అలాగే నిరుద్యోగులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డీజీపీని కోరారు. గతంలో విడుదలైన పోలీస్ నియామక...