PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 9:38 pm Posted by : PEOPLES DAIRY NEWS

పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎస్పీ అభినందనలు.

పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎస్పీ అభినందనలు.

పీపుల్స్ డైరీ. ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైమ్ రిపోర్టర్

భూపాలపల్లి, జిల్లా పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేయగా, నూతన కార్యవర్గ సభ్యులను ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఎస్పీ సూచించారు. పోలీసు శాఖలో ఐక్యత, పరస్పర సహకారం, సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలకు జిల్లా పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ తెలిపారు.
నూతన కార్యవర్గం: అధ్యక్షుడిగా గూగులోతు నరేష్ (ఎస్‌బీ కానిస్టేబుల్, భూపాలపల్లి), ఉపాధ్యక్షులుగా ఎన్. వెంకటేశ్వర్లు (ఇన్‌స్పెక్టర్, మహాదేవపూర్), ఎస్. సాంబమూర్తి (ఎస్‌ఐ, మహాదేవపూర్), కార్యదర్శిగా బి. అశోక్ (ఎస్‌ఐ, ఘనపూర్), జాయింట్ సెక్రటరీగా ఎ. రమేష్ (పీసీ, మహాముత్తారం), ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏ. సతీష్ (పీసీ, ఘనపూర్), కోశాధికారిగా ఓ. చిన్నన్న (కానిస్టేబుల్, పీసీఆర్, భూపాలపల్లి) ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా బి. సతీష్, డి. శ్రావణ్, పి. విజయ్, ఎం. అంబిక, ఎం. యాదిరెడ్డి, క్రాంతి ఎన్నికయ్యారు.