PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 10:16 am Posted by : PEOPLES DAIRY NEWS

ప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది.ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్..

ప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది..

క్షేత్రస్థాయిలో పోలీసింగ్ బలోపేతమే లక్ష్యం: ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్..

పీపుల్స్ డైరీ:. ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైమ్.

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని కిట్‌లను, రికార్డులను, వివిధ గదులను, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. రిసెప్షన్‌ను సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలు, స్టేషన్ నిర్వహణ తీరును పరిశీలించారు.
స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందితో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి విధి నిర్వహణ, ఎదురవుతున్న డ్యూటీ సంబంధిత సమస్యలు, వ్యక్తిగత సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తనతో స్వేచ్ఛగా పంచుకోవచ్చని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిబ్బందికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా రొటీన్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని సూచించారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన రికార్డులు, సీడ్ ఫైల్స్ (కేసు డైరీస్ ), దర్యాప్తు పత్రాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతి, కేసుల పెండెన్సీ, రికార్డుల నిర్వహణ, లో వివరాల నమోదు, అప్‌డేషన్ తదితర అంశాలను సమీక్షించారు. ప్రతి కేసు దర్యాప్తులో క్షేత్రస్థాయిలో పర్యటించి, వాస్తవాలను సేకరించి, శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఎస్సై రాజుతో కేసుల దర్యాప్తు, స్టేషన్ నిర్వహణ, రికార్డుల అప్‌డేషన్, నిర్వహణ, వీపీవో ల పనితీరు తదితర అంశాలపై ఎస్పీ చర్చించి పలు సలహాలు, సూచనలు చేశారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించి, ప్రతి కేసుకు సంబంధించిన రిపోర్టులు, రికార్డులు, సీడ్ ఫైల్స్ ‌ను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
వీపీవో ల పనితీరుపై ఎస్పీ ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రతి వీపీవో తనకు కేటాయించిన గ్రామాన్ని నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వారానికి కనీసం ఒకసారి గ్రామాలను తప్పనిసరిగా సందర్శించి, ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరియు భద్రతా భావన కలిగించే విధంగా పనిచేయాలని ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి, గుడుంబా మరియు ఇతర అక్రమ మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. గుడుంబా తయారీ, అక్రమ విక్రయాలు, రవాణాపై నిరంతరం దాడులు నిర్వహిస్తూ కఠినమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ చేపట్టాలని, అక్రమ మద్యం తయారీ కేంద్రాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు మరియు వినియోగంపై పటిష్టమైన నిఘా కొనసాగించాలని తెలిపారు.
పోలీసింగ్ అనేది కేవలం పోలీస్ స్టేషన్‌కు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలతో నిరంతర అనుసంధానంతో కొనసాగాలని ఎస్పీ తెలిపారు. అధికారులు, సిబ్బంది కేసుల విచారణలో భాగంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి, ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలించి దర్యాప్తు నాణ్యతను పెంచాలని సూచించారు. నేరాల నియంత్రణలో ముందస్తు నిఘా, నిరంతర ఫీల్డ్ విజిట్స్ కీలకమని పేర్కొన్నారు.ప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది..