నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి గ్రామంలో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. రూ. 12 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.గ్రామంలోని చిన్న పిల్లలకు, గర్భిణీలకు మెరుగైన సేవలు అందించేందుకు మరియు అంగన్‌వాడీ కేంద్రం మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు నర్సంపేట నియోజకవర్గ, మండల మరియు గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

