PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 11:15 am Posted by : PEOPLES DAIRY NEWS

బోనాల పర్వదినాల్లో ఎల్లంపేటలో విచ్చలవిడిగా బ్లాక్‌లో మద్యం అమ్మకాలు

బోనాల పర్వదినాల్లో ఎల్లంపేటలో విచ్చలవిడిగా బ్లాక్‌లో మద్యం అమ్మకాలు

మేడ్చల్ డివిజన్ పరిధిలో ఎక్సైజ్ శాఖపై తీవ్ర ఆరోపణలు

ఎల్లంపేట: ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలను అధికారికంగా మూసివేసినప్పటికీ, మేడ్చల్ డివిజన్ ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో విచ్చలవిడిగా బ్లాక్‌లో భారీగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.పండుగ నిబంధనల ప్రకారం మద్యం షాపులు మూసివేయాల్సిన సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని, ఈ వ్యవహారంపై అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కనుసైగల్లోనే ఈ అక్రమ దందా జరుగుతోందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అలాగే ఎక్సైజ్ సిబ్బందికి, అధికారులకు సమాచారం ఇవ్వడానికి ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల మద్యం సిండికేట్‌తో అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పండుగ సమయంలోనే ఇంత పెద్ద ఎత్తున బ్లాక్‌లో మద్యం విక్రయాలు జరుగుతున్నా చర్యలు లేకపోవడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇకనైనా మేడ్చల్ ఎక్సైజ్ శాఖ బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.