ముచింపుల గ్రామంలో మహిళా సంఘం (VO) భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నల్లబెల్లి మండలం ముచింపుల గ్రామంలో మహిళా సంఘం (VO) నూతన భవన నిర్మాణానికి నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. రూ. 10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఆయన భూమిపూజ చేసి, పనులను ప్రారంభించారు. గ్రామాల్లోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి, వారి సమాఖ్య సమావేశాలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ సొంత భవనం ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ, మండల మరియు గ్రామ స్థాయి కాంగ్రెస్...