PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 1:56 pm Posted by : PEOPLES DAIRY NEWS

మేడ్చల్ మండల విద్యాశాఖ కార్యాలయంలో ఘనంగా వన మహోత్సవం*

*మేడ్చల్ మండల విద్యాశాఖ కార్యాలయంలో ఘనంగా వన మహోత్సవం*

మేడ్చల్, జూలై 8: పీవీ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మేడ్చల్ మండల విద్యాశాఖ కార్యాలయం ఆవరణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శంకర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీవీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామేశ్వరరావు, ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.