PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 6:41 am Posted by : PEOPLES DAIRY NEWS

వంగరలో ఘనంగా ‘నూతన కిరాణం అండ్ జనరల్ స్టోర్’ ప్రారంభం.

వంగరలో ఘనంగా ‘నూతన కిరాణం అండ్ జనరల్ స్టోర్’ ప్రారంభం.

భీమదేవరపల్లి, ఆగస్టు 26 (పీపుల్స్ డైరీ):

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని ప్రధాన కేంద్రమైన అంబేద్కర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన “కిరాణా అండ్ జనరల్ స్టోర్‌”ను బుధవారం రోజున మేఘన ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు సుహాసిని ముఖ్య అతిథిగా హాజరై,రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ దుకాణాన్ని గ్రామ వార్డు మెంబర్ శారద-చక్రపాణి దంపతులు స్వయం ఉపాధిలో భాగంగా నెలకొల్పారు.ఈ సందర్భంగా మేఘన ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు సుహాసిని మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మరియు ప్రజాప్రతినిధులు సొంతంగా స్వయం సమృద్ధి సాధిస్తూ, వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం ఎంతో అభినందనీయమన్నారు.స్థానిక ప్రజలకు నిత్యం అవసరమయ్యే నాణ్యమైన కిరాణా సామాగ్రిని, నిత్యావసర సరుకులను అందుబాటు ధరలలో అందిస్తూ ఈ వ్యాపారం దిగ్విజయంగా సాగాలని, యజమానులకు ఆమె ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు.షాపు నిర్వాహకులు శారద-చక్రపాణి దంపతులు మాట్లాడుతూ… వంగర గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ నాణ్యమైన సరుకులను అందుబాటులో ఉంచుతామని, గ్రామస్తులందరూ తమను ఆదరించి ప్రోత్సహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు, వార్డ్ సభ్యులు గజ్జెల సురేష్,,మాజీ సర్పంచ్ కండె రమేష్,,ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మాట్ల వెంకట స్వామి, వార్డు సభ్యులు,వేముల సాధన,మిడిదొడ్డి తిరుపతి, స్థానిక నాయకులు,కండె సంజీవ్, గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యాపార నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.