PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 12:54 pm Posted by : PEOPLES DAIRY NEWS

వక్ఫ్ భూముల సర్వే నిర్వహిస్తున్న అధికారులు

వక్ఫ్ భూముల సర్వే నిర్వహిస్తున్న అధికారులు.

సర్వేకి ససేమిరా అంటున్న భూ యజమానులు ,స్థానికులు

వరంగల్

ఖిల్లా వరంగల్ మండల పరిధిలో ఉర్సు ప్రాంతంలో సర్వే నంబర్ 273,274,275,276 లో గల వక్ఫ్ బోర్డు కు సంబంధించిన భూమిని అక్రమార్కులు ఆక్రమించారని గత కొన్ని రోజులుగా పీపుల్స్ డైరీ పత్రికలో వస్తున్న కథనాలకు ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలింది జిల్లా సర్వే లాండ్ రికార్డు కార్యాలయ అధికారులు సర్వే నిమిత్తం భూమి పరిశీలనకు రాగా అక్కడ నివాసం ఉంటున్న యజమానులు సర్వే నిర్వహించటానికి నిరాకరిస్తున్నట్టు తెల్సింది అధికారులు నోటీసులు అందించినప్పటికీ భూ యజమానులు స్పందించకపోవడంతో అధికారులు సర్వే నిర్వహణకు గురువారం రోజు భూమి కొలతల విభాగం నుండి రాగా వారిని అడ్డుకుని సర్వే నిర్వహించకుండా గొడవకు దిగినట్టు సమాచారం