వడదెబ్బ మృతుల నమోదు శూన్యం
నల్లబెల్లి మండలంలో వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినప్పటికీ, సరైన అవగాహన లేక ఒక్క కేసు కూడా ఇప్పటివరకు నమోదు కాలేదు. వడదెబ్బ మరణంగా గుర్తించేందుకు పోస్టుమార్టం నిర్వహించడం తప్పనిసరి. తహసీల్దార్, ఎస్సై, వైద్యాధికారి సభ్యులుగా ఉండే త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా పరిహారం మంజూరవుతుంది. అయితే సమాచారం లేక బాధిత కుటుంబాలు ముందుకు రాకపోవడంతో అర్హులు ప్రభుత్వ సాయానికి దూరమవుతున్నారని అధికారులు చెబుతున్నారు.