PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 9:53 pm Posted by : PEOPLES DAIRY NEWS

వరంగల్ సిపి గా ఎన్. శ్వేత నియామకం.

#వరంగల్ సీపీగా ఎన్. శ్వేత నియామకం

వరంగల్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న సన్‌ప్రీత్ సింగ్‌ను రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో 2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎన్. శ్వేతను వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.ప్రస్తుతం హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్. శ్వేత, గతంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ, సిద్దిపేట పోలీస్ కమిషనర్, హైదరాబాద్ డీసీపీ, డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. పదేళ్ల సేవా కాలంలో మొత్తం తొమ్మిది ముఖ్యమైన పోస్టింగుల్లో పనిచేసిన అనుభవం ఆమె సొంతం.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్. శ్వేత ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, 2012లో యూపీఎస్సీ ద్వారా ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అనుభవజ్ఞురాలైన అధికారిణిగా గుర్తింపు పొందిన ఆమె నియామకంతో వరంగల్ పోలీసింగ్‌లో మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.