PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 11:08 am Posted by : PEOPLES DAIRY NEWS

వాహనాల రాకపోకలు నిలిపివేత.

వాహనాల రాకపోకలు నిలిపివేత.

ఏన్కూరు ఆగస్టు 10 పీపుల్స్ డైరీ

వరద నీటి ప్రవాహంతో నాచారం దేవాలయానికి వెళ్లే రహదారి దెబ్బ తిన్నదని దీని మూలంగా ,ఫోర్ వీలర్ వాహనాల రాకపోకలు నిలిపివేయడం జరిగిందని ఎస్సై సంధ్య తెలిపారు.
భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద నీటి ప్రవాహంతో ఏన్కూర్ మండలంలోని నాచారం టెంపుల్‌కు వెళ్లే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతిందనీ,బ్రిడ్జి సమీపంలోని రహదారి కొంత భాగం వరద నీటి ఉద్ధృతికి కొట్టుకుపోవడంతో రహదారిపై పెద్ద గండ్లు ఏర్పడి, ప్రస్తుతం వరద నీరు ప్రవహిస్తోందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఫోర్ వీలర్ వాహనాలు ఈ రహదారి మీదుగా వెళ్లే పరిస్థితి లేదు అని, వాహనదారులు, భక్తులు ప్రమాదకరంగా రహదారిని దాటేందుకు ప్రయత్నించవద్దని ఏన్కూర్ ఎస్సై సూచించారు.
నాచారం టెంపుల్‌కు వెళ్లే భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని, రహదారి పూర్తిగా పునరుద్ధరించి రాకపోకలకు సురక్షితంగా ప్రకటించే వరకు దెబ్బతిన్న ప్రాంతంలోకి వాహనాలతో వెళ్లవద్దని ఎస్సై కోరారు.