*సెయింట్ క్లారెట్ పాఠశాల బస్సు రోడ్డు ప్రమాదం.
*ఆగి ఉన్నదానిని వెనుక నుంచి ఢీకొట్టిన పాఠశాల బస్సు*
*బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అంటున్న స్థానికులు*
*ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు వారిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు*
మేడ్చల్ జూలై 26 (పీపుల్స్ డైరీ):- ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని జనతా దాబా వద్ద ఆగి ఉన్న లారీని సెయింట్ క్లారిట్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు విద్యార్థులు ఉండగా, వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను ద్విచక్ర వాహనాలపై సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే 108 సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని బాధితులకు వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.