PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 2:30 pm Posted by : PEOPLES DAIRY NEWS

35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.

35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.

పీపుల్స్ డైరీ. క్రైమ్

భూపాలపల్లి కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారిపై పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను భూపాలపల్లి సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు.వారి నుంచి సుమారు 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతో పాటు TS 02 UC 2103 నంబర్ గల టాటా ఏసి పికప్ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు.నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై కి అప్పగించారు.పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం, నిల్వ చేయడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిసిఎస్ పోలీసులు హెచ్చరించారు.