సాంకేతిక విద్యతోనే మెరుగైన భవిష్యత్‌

సాంకేతిక విద్యతోనే మెరుగైన భవిష్యత్‌ - మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి - అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ సంకీర్త్ భూపాలపల్లి, ఆగస్టు 6 (పీపుల్స్ డైరీ): నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధితోనే యువత మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలరని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను గురువారం సందర్శించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక వసతులు, శిక్షణా ప్రయోగశాలలను పరిశీలించారు. అనంతరం శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి...