ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నిజామాబాద్‌లో నూతన ఇంటర్న్‌లకు ఘనంగా అవగాహన కార్యక్రమం
నిజామాబాద్,జూన్ 02(పీపుల్స్ డైరీ) నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 2026–27 సంవత్సరానికి సంబంధించిన నూతన బ్యాచ్ CRMI (Compulsory Rotating Medical Internship) ఇంటర్న్‌ల కోసం అవగాహన మరియు ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. కృష్ణ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై ఇంటర్న్‌లను ఉద్దేశించి ప్రసంగించారు. వైద్య విద్య పూర్తి చేసి ప్రజాసేవలో అడుగుపెడుతున్న ఈ దశలో బాధ్యత, క్రమశిక్షణ, వైద్య నైతిక విలువలు పాటించాలని ఆయన సూచించారు.ఆసుపత్రి...