PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 1:08 pm Posted by : PEOPLES DAIRY NEWS

నూనె మిల్లులో ప్రమాదం – మహిళ చేయికి తీవ్ర గాయాలు

నల్లబెల్లి (వరంగల్ జిల్లా):

నల్లబెల్లి మండల కేంద్రంలోని ఓ నూనె మిల్లులో జరిగిన ఘోర ప్రమాదంలో రంగాపురంలో  మహిళా (CA) తీవ్రంగా గాయపడ్డారు.రంగాపురం గ్రామానికి చెందిన కందగట్ల కవిత వృత్తిరీత్యా రంగాపురం (CA) గా పనిచేస్తున్నారు.కవిత తన గృహ అవసరాల నిమిత్తం నూనె పట్టించుకోవడానికి నల్లబెల్లి మండల కేంద్రంలోని స్థానిక నూనె మిల్లుకు వచ్చారు.యంత్రంలో నూనె గింజలు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చేయి యంత్రం పళ్లచక్రాల మధ్య ఇరుక్కుపోయింది.యంత్రం బలంగా తిరుగుతుండటంతో ఆమె చేయి నలిగి, ఎముకలు విరిగి తీవ్రంగా తెగిపోయింది. ఈ ప్రమాదంతో బాధితురాలు తీవ్ర నొప్పితో అల్లాడిపోయారు.బాధితురాలి ఆర్తనాదాలు విన్న మిల్లు సిబ్బంది, స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అందరూ కలిసి ఎంతో శ్రమించి యంత్ర భాగాలను సడలించి ఆమె చేయిని బయటకు తీశారు.తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న కవితకు ప్రాథమిక చికిత్స అందించి, తక్షణమే మెరుగైన వైద్యం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.