🦁 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహిమ 🕉️

భక్తుని రక్షణకై అవతరించిన ఉగ్ర కరుణామయుడు హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తనను తాను దేవుడిగా ప్రకటించి, భగవంతుడిని పూజించవద్దని ప్రజలను బలవంతం చేశాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం చిన్న వయస్సులోనే శ్రీమహావిష్ణువుపై అచంచల భక్తిని పెంచుకున్నాడు. ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా “నారాయణ” నామాన్ని విడువలేదు. ప్రహ్లాదుడి భక్తిని చూసి కోపంతో ఉక్కిరిబిక్కిరైన హిరణ్యకశిపుడు, “నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు?” అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు, “అన్నిచోట్లా ఉన్నాడు” అని సమాధానం ఇచ్చాడు. దాంతో హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని...