PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 11:23 am Posted by : PEOPLES DAIRY NEWS

తహశీల్దార్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి

కాళోజీ సేవలు చిరస్మరణీయం

ప్రజాకవి కాళోజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి: తహశీల్దార్ ముప్పు కృష్ణ

స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్ శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ముప్పు కృష్ణ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ ముప్పు కృష్ణ మాట్లాడుతూ… తెలంగాణ భాష, సంస్కృతుల పరిరక్షణకు, ప్రజా చైతన్యానికి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. “అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవ, అన్యాయం సహిస్తే నా గొడవ” అంటూ తన రచనల ద్వారా అన్యాయాలపై గళమెత్తిన ధీశాలి కాళోజీ అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజాకవి కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గొప్ప విశేషమని అన్నారు.ఆ మహానుభావుడు కలిగించిన స్పూర్తిని నేటి తరాలకు అందించాలని, యుద్ధం గెలవాలంటే అయుధాలే అక్కరలేదు, అక్షరాలతో గెలిచే, గెలిపించే వీరులుంటారు, తెలంగాణా యాస, తెలుగు భాషను ఊపిరిగా, తెలుగు అక్షరాన్ని ఖడ్గం గా చేసుకొని పోరాడిన తెలుగు వీరుడని, పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని నినదించిన కాళోజి జీవితం అంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందని కొనియాడారు. కాళోజినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవలు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల గిర్దావర్లు మాడ సంపత్, ఎం. కృష్ణస్వామిలతో పాటు తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.