తహశీల్దార్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి
కాళోజీ సేవలు చిరస్మరణీయం ప్రజాకవి కాళోజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి: తహశీల్దార్ ముప్పు కృష్ణ స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్ శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ముప్పు కృష్ణ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ ముప్పు కృష్ణ మాట్లాడుతూ... తెలంగాణ భాష, సంస్కృతుల పరిరక్షణకు, ప్రజా చైతన్యానికి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. "అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవ, అన్యాయం సహిస్తే నా గొడవ"...