PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 8:03 pm Posted by : PEOPLES DAIRY NEWS

బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుడుతాల నగేష్**

**బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుడుతాల నగేష్**

(దుగ్గొండి) పీపుల్స్ డైరీ

నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుడుతాల నగేష్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా party (బీజేపీ) లో చేరారు.బీజేపీ సీనియర్ నాయకులు బూర్ల రవి ఆధ్వర్యంలో, మండల అధ్యక్షులు నెదురు రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో.. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్ష్యంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలపై ప్రజలు, నాయకులు విసుగు చెందారని విమర్శించారు. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలకు, అభివృద్ధికి ఆకర్షితులై రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే సరైన ప్రత్యామ్నాయమని గ్రహించి కుడుతాల నగేష్ బీజేపీలో చేరినట్లు స్పష్టం చేశారు. ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేస్తున్న పార్టీలకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.ఈ చేరికల కార్యక్రమంలో మహ్మదాపురం సొసైటీ వైస్ చైర్మన్ పాలడుగుల జీవన్, గోగుల రాజీ రెడ్డి మరియు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు