సమస్యలు ఎదురైతే నా దృష్టికి తీసుకురండి: డీసీపీ అంకిత్
ఇటుకాలపల్లి గ్రామ సభలో అనూహ్యంగా హాజరైన డీసీపీ గ్రామాల్లో శాంతి భద్రతల సమస్యలు పరిష్కారమైతే సమాజంలో క్రమక్రమంగా సానుకూల ప్రభావం కనిపిస్తుందని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ అన్నారు.ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామ సభకు ఆయన అనూహ్యంగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఏర్పడే శాంతి భద్రతల సమస్యలు, సైబర్ మోసాలు తదితర అంశాలను తన దృష్టికి తీసుకురావచ్చని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు....