పంట వ్యర్థాల దహనం చేస్తే జైలు, భారీ జరిమానాలు

వ్యర్థాల దహనంపై శాటిలైట్ నిఘా వ్యవసాయంలో కొత్త ప్రమాద ఘంటిక ఇప్పటివరకు ఉత్తర భారతదేశానికి, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రానికే పరిమితమైందని భావించిన పంట వ్యర్థాల దహనం సమస్య ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్నీ వేధిస్తోంది. వరి, మక్కజొన్న పంటల కోత అనంతరం మిగిలిపోయే ఎండు గడ్డిని రైతులు తగులబెట్టడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడమే కాకుండా ప్రాణ నష్టాలు కూడా సంభవిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పలు జిల్లాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో రైతులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం గ్రామీణ...