భవనం పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడు మృతి
భవనం పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడు మృతి మేడ్చల్, జూన్ 4(పీపుల్స్ డైరీ):- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయ వెంచర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో సెంట్రింగ్ పనులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు పై అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు, భవనం మూడో అంతస్తులో సెంట్రింగ్ పనులు చేస్తుండగా కార్మికుడు అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవర రవిగా...