ప్రజా భవన్‌లో ఆత్మీయ రాఖీ వేడుక: మంత్రి సీతక్కకు తన ‘జీవిత చరిత్ర’ పుస్తకాన్ని కానుకగా ఇచ్చిన యువ రచయిత కడియాల సురేష్ కుమార్
ప్రజా భవన్‌లో ఆత్మీయ రాఖీ వేడుక: మంత్రి సీతక్కకు ‘జీవిత చరిత్ర’ పుస్తకాన్ని కానుకగా ఇచ్చిన రచయిత కడియాల సురేష్ కుమార్ హైదరాబాద్: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో సోదరభావానికి వేదికగా నిలిచే ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి సీతక్క యువ రచయిత కడియాల సురేష్ కుమార్ కు ప్రేమానురాగాలతో రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ తాను స్వయంగా రచించిన మంత్రి సీతక్క గారి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆమెకు రాఖీ కానుకగా బహుకరించారు....