PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 7:57 pm Posted by : PEOPLES DAIRY NEWS

బిజెవైఎం జిల్లా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కన్వీనర్‌గా దికొండ సునీల్ నియామకం

బిజెవైఎం జిల్లా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కన్వీనర్‌గా దికొండ సునీల్ నియామకం

 

భారతీయ జనతా యువమోర్చా (BJYM) జిల్లా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కన్వీనర్‌గా దికొండ సునీల్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మరియు పార్టీ నాయకత్వానికి సునీల్ మరియు వారి మద్దతుదారులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా, తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన భారతీయ జనతా పార్టీ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ కి , జిల్లా యువమోర్చా అధ్యక్షులు ఎర్రగోల భరత్ వీర్ లతో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.పార్టీ నాయకత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలకు చేరువ చేయడంతో పాటు, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ బాధ్యతలు చేపట్టిన దికొండ సునీల్ కి పార్టీ శ్రేణులు మరియు మద్దతుదారులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.