బెదిరింపులకు భయపడం.. దాడులతో బీజేపీని ఆపలేరు: తడుక వినయ్ గౌడ్ హెచ్చరిక

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి.. కాంగ్రెస్ గూండాయిజానికి నిదర్శనం: తడుక వినయ్ గౌడ్ నల్లబెల్లి: నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి కాంగ్రెస్ పార్టీ అసలు రాజకీయ సంస్కృతిని, వారి అసహన వైఖరిని బయటపెట్టిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనే దమ్ము లేకనే దాడులు, విధ్వంసాలకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజల మద్దతుతో...