PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 5:12 pm Posted by : PEOPLES DAIRY NEWS

చూపునిచ్చిన డాక్టర్ గోగుల… పేదలకు వరంగా మారిన ‘జనతా ట్రస్ట్’!

చూపునిచ్చిన డాక్టర్ గోగుల…

పేదలకు వరంగా మారిన ‘జనతా ట్రస్ట్’!

నల్లబెల్లిలో ‘కంటి వెలుగు’

కాంతులు… 31 కుటుంబాల్లో వెలిగిన కొత్త ఆశలు!

*31 మంది జీవితాల్లో వెలుగులు నింపిన ‘జనతా ట్రస్ట్’*

*విజయవంతంగా ఉచిత కంటి ఆపరేషన్లు – ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం: డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి*

పేదవాడి కంటి వెలుగు కోసం జనతా ట్రస్ట్ చేస్తున్న నిరంతర సేవకు నిదర్శనంగా మరో భారీ సేవా కార్యక్రమం విజయవంతమైంది.

నల్లబెల్లి మండల ప్రజల కోసం జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో, శంకర ఐ ఫౌండేషన్ ఇండియా మరియు శ్రీ కాంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ సహకారంతో ఇటీవల భారీ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వందలాది మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వైద్యుల సలహా మేరకు 31 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు.

*ఉచిత రవాణా & కార్పొరేట్ స్థాయిలో ఆపరేషన్లు:*

బాధితులందరినీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యాధునిక పద్ధతిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో, తిరిగి చూపు పొందిన 31 మంది లబ్ధిదారులు ఈరోజు సురక్షితంగా నల్లబెల్లికి చేరుకున్నారు.

*కన్నీటిపర్యంతమైన లబ్ధిదారులు:*

గత కొన్ని సంవత్సరాలుగా దృష్టి లోపంతో బాధపడుతూ, ఆర్థిక స్తోమత లేక ఆపరేషన్ చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న బాధితులు తిరిగి చూపు రావడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “జనతా ట్రస్ట్ వల్లే మాకు మళ్ళీ ఈ లోకాన్ని చూసే భాగ్యం కలిగింది. జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కి మేము జీవితాంతం రుణపడి ఉంటాం” అని కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.

*ప్రజా సేవే మా లక్ష్యం – ప్రజల ఆరోగ్యమే మా బాధ్యత:*

ఈ సందర్భంగా జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ0పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించడమే మా ముఖ్య ఉద్దేశం 31 మంది జీవితాల్లో వెలుగులు నింపడం మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. భవిష్యత్తులో కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాంటి అనేక సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తాం” అని స్పష్టం చేశారు.