మండలంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు
గణపురం, ఆగస్టు 27 (పీపుల్స్ డైరీ): రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని వివిధ పాఠశాలల్లో ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర నాయకులు మంద మహేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల్లో అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య సంబంధాన్ని నెలకొలిపే విధంగా విద్యార్థినులు ప్రతి విద్యార్థికి రాఖీ బంధాన్ని ఏర్పరిచారు. రాఖీలు కట్టుకుని సోదరభావాన్ని చాటుకున్నారు. ‘నాకు నువ్వు రక్ష.. నీకు నేను రక్ష.. మనమంతా మన దేశానికి రక్ష.. మేరా భారత్ మహాన్’ అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు...