నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సేవలకు ముగింపు.. నల్లబెల్లి వీఆర్ఏ కొమరమ్మ మృతి

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సేవలకు ముగింపు.. నల్లబెల్లి వీఆర్ఏ కొమరమ్మ మృతి నల్లబెల్లి మండల కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. గత నాలుగు దశాబ్దాలుగా నిస్వార్థంగా సేవలందించిన ఒక నిబద్ధత గల ఉద్యోగినిని ఆ ప్రాంతం కోల్పోయింది. మండల కేంద్రంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (VRA)గా విధులు నిర్వహిస్తున్న కీసరి కొమరమ్మ ఈరోజు ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు.కొమరమ్మ గత 40 సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో సేవకురాలిగా, వీఆర్ఏగా తన విధులను నిర్వర్తించారు.నల్లబెల్లి మండల పరిధిలోని ప్రజలకు, రెవెన్యూ అధికారులకు మధ్య ఆమె ఒక బలమైన...