మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎక్మో చికిత్స
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఎక్మో (ECMO) విధానంలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈరోజే గుండెపోటుకు గురైన పెద్ది సుదర్శన్ రెడ్డిని తొలుత హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక వైద్య సదుపాయాలు ఉన్న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఎక్మో సపోర్ట్‌పై చికిత్స...