– కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్ల పంపిణీ
పీపుల్స్ డైరీ, గణపురం: తెలంగాణ తొలి శాసనసభాపతి, శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను మంగళవారం మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, సిరికొండ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. భూపాలపల్లి అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్రను నాయకులు కొనియాడారు. మండల కేంద్రంలో సిరికొండ యువసేన ఆధ్వర్యంలో మధుసూదనాచారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్గా నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను నాయకులు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బైరగాని కుమారస్వామి, డాక్టర్ జన్నయ్య, రత్నం రవి, కసిరెడ్డి వెంకన్న, తంగెళ్లపెల్లి వెంకట్, ఆకుల తిరుపతి, పాసికంటి రామకృష్ణ, బొబ్బాల సాంబయ్య, వీర్ల సారయ్య, పులిగిల్ల సమ్మయ్య, కొత్తపల్లి కుమారస్వామి, అంబేడ్కర్, మాటేటి రమేష్, మహబూబ్ పాషా, నగావత్ కిషన్, పోశాల రాజు, బానాల చంద్రమౌళి, యాకూబ్ పాషా, మందారపు సమ్మయ్య, మంజము విష్ణు, కొలపాక శ్రీనివాస్, బుర్రి నరేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
– చెల్పూరులో…
చెల్పూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన సంబురాలు జరిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నడిపెల్లి మధుసూదన రావు, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి మోతె కరుణాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొలసాని లక్ష్మీనరసింహారావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ దాసరి రవీందర్తో పాటు నాయకులు సాంబారెడ్డి, హన్మంతరావు, రేపాక రాజేందర్, అల్లూరి శ్రీనివాస్, పున్నం రమేష్, రజియా, ప్రమీల, దొగ్గెల దేవేందర్, రాజేశ్వర్రావు, నగేష్, బాబు, సుధాకర్, రాజయ్య, కోల మోహన్, శ్రీనివాస్, మధూకర్, శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
