కరీంనగర్‌లో గణేష్ మండపాలకు ఉచిత కరెంట్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసే అన్ని గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మండపాలకు అయ్యే విద్యుత్ బిల్లులను కరీంనగర్ కార్పొరేషన్ చెల్లిస్తుందని వెల్లడించారు. కరీంనగర్‌లో ఏటా దాదాపు 2 వేల గణేష్ మండపాలు ఏర్పాటు అవుతున్నాయని, గత మూడేళ్లుగా వాటి విద్యుత్ ఛార్జీలను తానే సొంతంగా చెల్లిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ప్రస్తుతం కార్పొరేషన్ ద్వారా అన్ని మండపాలకు ఉచిత విద్యుత్ అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు...