నల్లబెల్లిలో ‘పెద్ది’ విగ్రహానికి భూమిపూజ

నల్లబెల్లిలో 'పెద్ది' విగ్రహానికి భూమిపూజ అఖిలపక్షం ఏకగ్రీవ నిర్ణయానికి గ్రామస్థుల మద్దతు నల్లబెల్లి: పీపుల్స్ డైరీ మాజీ ఎమ్మెల్యే, దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి జ్ఞాపకార్థం నల్లబెల్లి మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. విగ్రహ ఏర్పాటుకు గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో ఈ కార్యక్రమానికి విశేష ప్రాధాన్యం చేకూరింది.ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం నర్సంపేట నియోజకవర్గ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రజలతో మమేకమై ఆయన అందించిన సేవలను చిరస్థాయిగా నిలిపేందుకు...