పెద్దమ్మ తల్లి ఆలయానికి భూమిపూజ

- భూమిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర పీపుల్స్ డైరీ, గణపురం: గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఆలయ నిర్మాణ స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్థులు, భక్తులు సమష్టిగా...