కీసరలో హృదయవిదారకం: ధోబీఘాట్ వద్ద నవజాత శిశువు మృతదేహం లభ్యం
మేడ్చల్, మే 29 (మీడియా ప్రతినిధి): కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. నాగారం విజయపురి కాలనీ రోడ్ నెం.4లోని ధోబీఘాట్ ప్రాంతంలో గుర్తుతెలియని నవజాత మగ శిశువు మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పోలీసుల కథనం ప్రకారం: మే 28న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో, స్థానికుడు తిరుమల శెట్టి సోమరాజు ఇచ్చిన డయల్-100 సమాచారం మేరకు పెట్రోల్ మొబైల్-2 ఇన్‌చార్జ్ పి.సి జంగయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ధోబీఘాట్...