PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 8:12 pm Posted by : PEOPLES DAIRY NEWS

తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు అండగా ‘జనతా ట్రస్ట్’

తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు అండగా ‘జనతా ట్రస్ట్’
రూ. 10,000 ఆర్థిక సాయం అందించిన ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

చెన్నారావుపేట, జూలై 10:

తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు తామున్నామంటూ జనతా ట్రస్ట్ మానవత్వాన్ని చాటుకుంది. నర్సంపేట నియోజకవర్గం, చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామానికి చెందిన బుడిగే శిరీష – రవికుమార్ దంపతులు కొన్ని రోజుల క్రితం ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ విషాద ఘటనతో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన బాధిత కుటుంబాన్ని జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులతో కలిసి శుక్రవారం పరామర్శించారు. తల్లిదండ్రులు లేని లోటుతో కుమిలిపోతున్న ఆ దంపతుల కుమారులైన సుశాంత్, విద్వాన్ష్‌లను ఆయన ఓదార్చారు. వారికి మనోధైర్యాన్ని చెబుతూ, భవిష్యత్తులో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లల తక్షణ ఖర్చుల నిమిత్తం ట్రస్ట్ తరఫున రూ. 10,000/- (పది వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.”తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లల పరిస్థితి అత్యంత హృదయవిదారకం. ఇలాంటి కష్టసమయంలో వారిని ఆదుకోవడం మనందరి బాధ్యత. జనతా ట్రస్ట్ ఎల్లప్పుడూ వీరికి తోడుగా ఉంటుంది.”ఈ కార్యక్రమంలో జనతా ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక నాయకులు దుంకదువ్వ రంజిత్, గూడూరు సందీప్, మురహరి విజయ్, అచ్చ దయాకర్, బానోత్ రమేష్, విజయ్ సింగ్, మరాఠి ఉప్పలయ్య, మేడి సంతోష్, కందల చంద్రమౌళి, మేడి వంశీ కృష్ణ, బండి రాజ్ కుమార్, పాల్తీయ శశీందర్, నరేష్, సుమన్, నవీన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు