తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు అండగా ‘జనతా ట్రస్ట్’

తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు అండగా 'జనతా ట్రస్ట్' రూ. 10,000 ఆర్థిక సాయం అందించిన ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి చెన్నారావుపేట, జూలై 10: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు తామున్నామంటూ జనతా ట్రస్ట్ మానవత్వాన్ని చాటుకుంది. నర్సంపేట నియోజకవర్గం, చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామానికి చెందిన బుడిగే శిరీష - రవికుమార్ దంపతులు కొన్ని రోజుల క్రితం ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ విషాద ఘటనతో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన బాధిత...